చిన్నారులు, యుక్త వయస్కుల కోసం Family Link గోప్యత గైడ్
మీ వయస్సును ఎంచుకోండి
6-8 ఏళ్ల వారు
9-12 ఏళ్ల వారు
13-17 ఏళ్ల వారు
Googleలో మీ గోప్యత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
మీరు సరియైన చోటికి వచ్చారు! మీ Google సంబంధిత అంశాలతో మీ తల్లి/తండ్రి ఎలా సహాయపడగలరు, Google ఏ సమాచారాన్ని ఉపయోగిస్తుంది లాంటి పిల్లలు ఎక్కువగా అడిగే ప్రశ్నలు మరిన్నింటిని చదవండి.
తల్లి/తండ్రి, ఈ సమాచారం 13 (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం, మా గోప్యతా ప్రకటన, గోప్యతా పాలసీ చూడండి.

నా ఖాతాకు నిర్వహణ బాధ్యత వహించేది ఎవరు?
మీ Google ఖాతా బాధ్యత మీ తల్లి/తండ్రిది. దానిని నిర్వహించడంలో సహాయం పొందడానికి వారు Family Link అనే యాప్‌ను ఉపయోగించవచ్చు. మీకు తగిన వయస్సు వచ్చినప్పుడు మీరు బాధ్యత తీసుకోవచ్చు.
మీ తల్లి/తండ్రి ఇలాంటివి చేయగలుగుతారు:
మీ తల్లి/తండ్రి ఇలాంటివి చేయగలుగుతారు:
- మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం, మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం, లేదా మీ ఖాతాను తొలగించడం.
- మీ ఫోన్ లేదా టాబ్లెట్‌ను లాక్ చేయడం.
- మీ ఫోన్ లేదా టాబ్లెట్ ఎక్కడ ఉందో చూడటం.
- మీరు ఏ యాప్‌లను ఉపయోగించవచ్చో ఎంపిక చేయడం.
- మీరు మీ యాప్‌లను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో చూడటం.
- Google Search, YouTube, Google Play వంటి కొన్ని యాప్‌లలో మీరు చూసే వాటిని మార్చడం.
- మీ యాక్టీవిటీ కంట్రోల్స్‌ను ఎంపిక చేయడం. (ఇవి Googleతో మీరు ఏం చేస్తారనే సమాచారాన్ని సేవ్ చేసే సెట్టింగ్‌లు.)
- మీ యాప్‌లకు సెట్టింగ్‌లను, అనుమతులను ఎంపిక చేయడం.
- మీ ఖాతాకు పేరు, పుట్టిన తేదీ, అలాగే ఇతర సమాచారాన్ని ఎంపిక చేయడం.
- Google Play వంటి Google ప్రోడక్ట్‌లలో మీరు వేటిని డౌన్‌లోడ్ చేయవచ్చో, వేటిని కొనుగోలు చేయవచ్చో ఎంపిక చేయడం.
Google నా సమాచారాన్ని ఎందుకు, ఏ విధంగా ఉపయోగిస్తుంది?
మీరు గాని, మీ తల్లి/తండ్రి గాని మాకు అందించే సమాచారాన్ని మేము సేవ్ చేయవచ్చు, ఉదాహరణకు మీ పుట్టినరోజు వంటివి. మీరు మా యాప్‌లను, సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా మేము సమాచారాన్ని సేవ్ చేస్తాము. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము, వాటిని వివిధ కారణాల కోసం ఉపయోగిస్తాము — ఉదాహరణకు Google యాప్‌లను, సైట్‌లను మరింత సహాయకరంగా తయారు చేయడానికి.
మీ తల్లి/తండ్రితో, మీ సమాచారాన్ని మేము వేటి కోసం ఉపయోగించవచ్చో, వాటిలో కొన్నిటిని తెలుసుకోండి:
మీ తల్లి/తండ్రితో, మీ సమాచారాన్ని మేము వేటి కోసం ఉపయోగించవచ్చో, వాటిలో కొన్నిటిని తెలుసుకోండి:
- మా యాప్‌లను, సైట్‌లను పనిచేసేలా చేయడం కోసం: ఉదాహరణకు, Google Searchలో మీరు "కుక్క పిల్లలు" అని సెర్చ్ చేస్తే, మీ సమాచారాన్ని కుక్క పిల్లలకు సంబంధించిన విషయాలను చూపడానికి ఉపయోగిస్తాము.
- మా యాప్‌లను, సైట్‌లను మెరుపరచడం కోసం: ఉదాహరణకు, ఏదైనా పని చేయకపోతే, దానిని సరిచేయడానికి మేము సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
- Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడం కోసం: ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము.
- కొత్త యాప్‌లను, సైట్‌లను రూపొందించడం కోసం: Googleకు సంబంధించి మేము రూపొందించదగిన కొత్త వాటికి ఉపాయాలను కనిపెట్టడం కోసం, మా ప్రస్తుత యాప్‌లను, సైట్‌లను వ్యక్తులు ఏవిధంగా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకుంటాము.
- మీకు నచ్చే అవకాశం ఉన్న వాటిని చూపించడం కోసం: ఉదాహరణకు, YouTube Kidsలో మీకు జంతువుల వీడియోలు చూడటం ఇష్టమయితే, మేము మీకు మరిన్నిటిని చూపవచ్చు.
- మీకు యాడ్‌లను చూపించడానికి మీరు చూస్తున్న సైట్‌ల వంటి అంశాల ఆధారంగా.
- మిమ్మల్ని సంప్రదించడానికి: ఉదాహరణకు, మీకు మెసేజ్ పంపడానికి, మేము మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా సరే, మీకు తెలియని వారి నుండి మెసేజ్ వచ్చినప్పుడు, తల్లి/తండ్రిని అడగండి.
వేటిని సేవ్ చేయాలో నేను Googleకు చెప్పవచ్చా?
అవును, మీ గురించి మేము సేవ్ చేసే కొన్ని విషయాలను మీరు మార్చవచ్చు. యాక్టివిటీ కంట్రోల్స్ వంటి మీ గోప్యతా సెట్టింగ్‌లు కొన్నింటిలో మీరు మార్పులు చేస్తే, మేము మీ తల్లి/తండ్రికి తెలియజేస్తాము. వారు కూడా మీ సెట్టింగ్‌లను మార్చడంలో మీకు సహాయపడగలరు.
మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు, మీ తల్లి/తండ్రి ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు .
మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు, మీ తల్లి/తండ్రి ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు .
Googleలో మీ గోప్యత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
మీరు సరియైన చోటికి వచ్చారు! మీరు మా యాప్‌లను, సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, Google సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది అన్నది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ Google ఖాతాను, పరికరాలను మేనేజ్ చేయడానికి మీ తల్లి/తండ్రి మీకు ఎలా సహాయపడవచ్చు అనేది కూడా మీరు నేర్చుకుంటారు.
తల్లి/తండ్రి, ఈ సమాచారం 13 (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం, మా గోప్యతా ప్రకటన, గోప్యతా పాలసీ చూడండి.
తల్లి/తండ్రి, ఈ సమాచారం 13 (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం, మా గోప్యతా ప్రకటన, గోప్యతా పాలసీ చూడండి.
నా ఖాతాకు నిర్వహణ బాధ్యత వహించేది ఎవరు?
ప్రస్తుతం మీ Google ఖాతాకు మీ తల్లి/తండ్రి బాధ్యత వహిస్తున్నారు. మీ ఖాతాను స్వయంగా నిర్వహించడానికి అవసరమైనంత వయస్సు మీకు వచ్చే వరకు దానిని నిర్వహించడంలో సహాయం పొందడానికి వారు Family Link అనే యాప్‌ను ఉపయోగించవచ్చు.
మీ తల్లి/తండ్రి ఇలాంటివి చేయగలుగుతారు:
మీ తల్లి/తండ్రి ఇలాంటివి చేయగలుగుతారు:
- మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం, మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం, లేదా మీ ఖాతాను తొలగించడం.
- మీ ఫోన్‌లు లేదా టాబ్లెట్‌ల వంటి పరికరాలను ఎంత సమయం పాటు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయంలో పరిమితులను సెట్ చేయడం.
- మీ ఫోన్ లేదా టాబ్లెట్ ఎక్కడ ఉందో చూడటం.
- మీరు ఏ యాప్‌లను ఉపయోగించవచ్చో ఎంపిక చేయడం.
- మీరు మీ యాప్‌లను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో చూడటం.
- Google Search, YouTube, Google Play వంటి కొన్ని యాప్‌లలోనూ సైట్స్‌లోనూ కంటెంట్ సెట్టింగ్‌లను నిర్వహించడం. ఈ సెట్టింగ్‌లు మీరు వేటిని చూస్తారనేదానిని మార్చవచ్చు.
- మీ ఖాతాకు యాక్టీవిటీ కంట్రోల్స్‌ను; అంటే YouTube హిస్టరీ వంటి వాటిని, మీరు స్వయంగా నిర్వహించడాన్ని బ్లాక్ చేయడంతో సహా, వారు నిర్వహించడం.
- మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో యాప్‌లకు అనుమతులను రివ్యూ చేయడం, అంటే ఉదాహరణకు యాప్‌లు మీ మైక్రోఫోన్, కెమెరా లేదా కాంటాక్ట్‌లను ఉపయోగించడానికి అనుమతులను ఇవ్వడం, లేదా ఇవ్వకపోవడం వంటివి.
- మీ ఖాతాను గురించిన సమాచారాన్ని అంటే మీ పేరు, లింగం, లేదా పుట్టిన తేదీ వంటి వాటిని చూడటం, మార్చటం లేదా తొలగించడం.
- మీ డౌన్‌లోడ్‌లు, కొనుగోళ్లను Google Play వంటి కొన్ని యాప్‌లు, సైట్‌లలో ఆమోదించడం.
Google నా సమాచారాన్ని ఎందుకు, ఏ విధంగా ఉపయోగిస్తుంది?
అనేక సైట్‌లు, యాప్‌ల విషయంలో జరిగినట్టే, మేము మీ తల్లి/తండ్రి మాకిచ్చే సమాచారాన్ని సేకరిస్తాము, అలాగే మీరు మా సైట్‌లు, యాప్‌లను ఉపయోగించేటప్పుడు కూడా సమాచారాన్ని సేకరిస్తాము. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము, మా ప్రోడక్ట్‌లను మీకు మరింత ఉపయోగపడేలా తీర్చి దిద్దడానికి దాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ డేటాను ఇందుకు సేకరిస్తాము:
- మా యాప్‌లను, సైట్‌లను పనిచేసేలా చేయడం కోసం: ఉదాహరణకు, Google Searchలో మీరు "క్రీడలు" అని సెర్చ్ చేస్తే, మీ సమాచారాన్ని క్రీడలకు సంబంధించిన విషయాలను చూపడానికి ఉపయోగిస్తాము.
- మా యాప్‌లను, సైట్‌లను మెరుపరచడం కోసం: ఉదాహరణకు, ఏదైనా పని చేయకపోతే, దానిని సరిచేయడానికి మేము సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
- Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడం కోసం: ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము, అంటే మోసాన్ని గుర్తించడం, దానిని నివారించడం వంటివి.
- కొత్త యాప్‌లను, సైట్‌లను రూపొందించడం కోసం: మేము రూపొందించదగిన కొత్త Google ప్రోడక్ట్‌లకు ఉపాయాలను కనిపెట్టడం కోసం, మా ప్రస్తుత యాప్‌లను, సైట్‌లను వ్యక్తులు ఏవిధంగా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకుంటాము.
- మీకోసం సమాచారాన్ని వ్యక్తిగతీకరించడానికి, అంటే మీకు నచ్చే అవకాశం ఉంది అని మేము అనుకున్న వాటిని చూపించడానికి. ఉదాహరణకు, మీరు YouTube Kidsలో జంతువుల వీడియోలను చూడటం ఇష్టపడితే, మేము మరిన్ని వీడియోలను చూడమని సిఫార్సు చేస్తాము.
- మీకు యాడ్‌లను చూపించడానికి మీరు చూస్తున్న సైట్‌ల వంటి అంశాల ఆధారంగా.
- మిమ్మల్ని సంప్రదించడానికి: ఉదాహరణకు, ఏదైనా సెక్యూరిటీ సమస్య ఉన్నప్పుడు, మేము మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా సరే, మీకు తెలియని వారి నుండి మెసేజ్ వచ్చినప్పుడు, తల్లి/తండ్రిని అడగండి.
వేటిని సేవ్ చేయాలో నేను Googleకు చెప్పవచ్చా?
అవును, మీ గురించి మేము సేవ్ చేసే కొన్ని విషయాలను మీరు మార్చవచ్చు. ఉదాహరణకు, మీ YouTube హిస్టరీని మీ Google ఖాతాకు మేము సేవ్ చేయకూడదని అనుకుంటే మీరు YouTube హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. యాక్టివిటీ కంట్రోల్స్ వంటి మీ గోప్యతా సెట్టింగ్‌లు కొన్నింటిలో మీరు మార్పులు చేస్తే, మేము మీ తల్లి/తండ్రికి తెలియజేస్తాము. వారు కూడా మీ సెట్టింగ్‌లను మార్చడంలో మీకు సహాయపడగలరు.
మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు, మీ తల్లి/తండ్రి ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు .
మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు, మీ తల్లి/తండ్రి ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు .
Googleలో మీ గోప్యత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
మీ Google ఖాతా గురించి సమాచారాన్ని Google ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది అన్నది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ Google ఖాతాను, పరికరాలను మేనేజ్ చేయడానికి మీ తల్లి/తండ్రి మీకు ఎలా సహాయపడవచ్చు అనేది కూడా మీరు నేర్చుకుంటారు.
కనీస వయో అర్హతకు తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, యుక్తవయస్కులు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఈ సమాచారం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరింత తెలుసుకోవడం కోసం, మా Privacy Notice and Privacy Policy చూడండి.

నా ఖాతాను నిర్వహించడంలో నా తల్లి/తండ్రి సహాయం చేయవచ్చా?
మీ Google ఖాతాకు సంబంధించిన విషయాలను నిర్వహించడంలో సహాయం పొందడానికి, మీ తల్లి/తండ్రి Family Link అనే యాప్‌ను ఉపయోగించవచ్చు. మీ పరికరాన్ని బట్టి వారు ఇటువంటివి చేయగలుగుతారు:
- మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం, మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం, లేదా మీ ఖాతాను తొలగించడం.
- మీ పరికరాన్ని మీరు ఎంత సమయం పాటు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనే దానిపై పరిమితులను సెట్ చేయడం.
- మీరు సైన్ ఇన్ చేసిన, యాక్టివ్‌గా ఉన్న పరికరాల లొకేషన్‌ను చూడటం.
- మీ యాప్‌లను నిర్వహించి, మీరు వాటిని ఎంత మేరకు వాడుతున్నారో చూడటం.
- Google Search, YouTube, Google Play వంటి కొన్ని యాప్‌లలోనూ సైట్స్‌లోనూ కంటెంట్ సెట్టింగ్‌లను నిర్వహించడం. ఈ సెట్టింగ్‌లు మీరు వేటిని చూస్తారనేదానిని మార్చవచ్చు.
- మీ ఖాతాకు యాక్టీవిటీ కంట్రోల్స్‌ను; అంటే YouTube హిస్టరీ వంటి వాటిని, మీరు స్వయంగా నిర్వహించడాన్ని బ్లాక్ చేయడంతో సహా, వారు నిర్వహించడం.
- మీ పరికరంలో యాప్‌లకు అనుమతులను రివ్యూ చేయడం, అంటే ఉదాహరణకు యాప్‌లు మీ మైక్రోఫోన్, కెమెరా లేదా కాంటాక్ట్‌లను ఉపయోగించడానికి అనుమతులను ఇవ్వడం, లేదా ఇవ్వకపోవడం వంటివి.
- మీ ఖాతాను గురించిన సమాచారాన్ని అంటే మీ పేరు, లింగం, లేదా పుట్టిన తేదీ వంటి వాటిని చూడటం, మార్చటం లేదా తొలగించడం.
- మీ డౌన్‌లోడ్‌లు, కొనుగోళ్లను Google Play వంటి కొన్ని యాప్‌లు, సైట్‌లలో ఆమోదించడం.
Google ఎందుకు, ఏవిధంగా నా సమాచారాన్ని సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది?
అనేక సైట్‌లు, యాప్‌ల విషయంలో జరిగినట్టే, మేము మీ తల్లి/తండ్రి మాకిచ్చే సమాచారాన్ని సేకరిస్తాము, అలాగే మీరు మా సైట్‌లు, యాప్‌లను ఉపయోగించేటప్పుడు కూడా సమాచారాన్ని సేకరిస్తాము. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము, మా ప్రోడక్ట్‌లను మీకు మరింత ఉపయోగపడేలా తీర్చి దిద్దడానికి దాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ డేటాను ఇందుకు సేకరిస్తాము:
- Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడం కోసం: ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము డేటాను ఉపయోగిస్తాము, అంటే మోసాన్ని గుర్తించడం, దానిని నివారించడం వంటివి.
- మా సర్వీస్‌లను అందించడం కోసం: ఆ డేటాను మేము మా సర్వీస్‌లను అందించడానికి ఉపయోగిస్తాము; అంటే ఫలితాలను అందించడం కోసం, మీరు సెర్చ్ చేసే క్వెరీలను ప్రాసెస్ చేయడం వంటి వాటికి.
- మా సర్వీస్‌లను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి: ఉదాహరణకు మేము మా ప్రోడక్ట్‌లు పనిచేయడం ఆగిపోవాల్సి ఉన్నప్పుడు అవి ఆగిపోయాయో లేదో ట్రాక్ చేయగలుగుతాము. అలాగే సెర్చ్ క్వెరీలలో వేటికి స్పెల్లింగ్‌లు ఎక్కువ తరుచుగా తప్పుపోతుంటాయో అర్థం చేసుకోవడం వల్ల, మా సర్వీస్‌లన్నింటా స్పెల్ చెక్ ఫీచర్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయం లభిస్తుంది.
- కొత్త సర్వీస్‌లను అభివృద్ధి చేయడానికి: ఈ డేటా మాకు కొత్త సర్వీస్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, వ్యక్తులు Google మొదటి ఫోటోల యాప్ అయిన Picasaలో తమ ఫోటోలను ఏ విధంగా క్రమంలో పెట్టుకున్నారో అర్థం చేసుకోవడం అనేది, Google Photosను డిజైన్ చేయడంలోనూ లాంచ్ చేయడంలోనూ మాకు సహాయపడింది.
- కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడానికి, అంటే మీకు నచ్చే అవకాశం ఉంది అని మేము అనుకొనే వాటిని చూపించడానికి. ఉదాహరణకు, మీరు YouTubeలో క్రీడల వీడియోలను చూడటం ఇష్టపడితే, మేము మరిన్ని వీడియోలను చూడమని సిఫార్సు చేస్తాము.
- మీకు యాడ్‌లను చూపించడానికి మీరు సందర్శించే సైట్‌లు, ఎంటర్ చేసే సెర్చ్ క్వెరీలు, లేదా మీ నగరం లేదా రాష్ట్రం ఆధారంగా.
- పనితీరును అంచనా వేయడానికి: మేము డేటాను పనితీరును అంచనా వేయడానికి, మా సర్వీస్‌లను ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తాము.
- మిమ్మల్ని సంప్రదించడానికి: ఉదాహరణకు మేము ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీని గుర్తిస్తే, ఆ నోటిఫికేషన్‌ను మీకు పంపడానికి మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించవచ్చు.
Google వేటిని సేవ్ చేస్తుందనే దానిని నేను ఏ విధంగా నిర్ణయించగలను?
మీ సెట్టింగ్‌లతో, మేము సేకరించే డేటాతో పాటు, ఆ డేటా ఎలా ఉపయోగించబడుతుందో అనే దానిని మీరు పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు, మీ YouTube హిస్టరీని మీ Google ఖాతాకు మేము సేవ్ చేయకూడదని అనుకుంటే మీరు YouTube హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. మీ యాక్టివిటీ కంట్రోల్స్‌లో మీరు మార్పులు చేస్తే, మేము మీ తల్లి/తండ్రికి తెలియజేస్తాము. మీ గోప్యతా సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి
మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు..
మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు..