6-8 ఏళ్ల వారు
9-12 ఏళ్ల వారు
13-17 ఏళ్ల వారు

Googleలో మీ గోప్యత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

మీరు సరియైన చోటికి వచ్చారు! మీ Google సంబంధిత అంశాలతో మీ తల్లి/తండ్రి ఎలా సహాయపడగలరు, Google ఏ సమాచారాన్ని ఉపయోగిస్తుంది లాంటి పిల్లలు ఎక్కువగా అడిగే ప్రశ్నలు మరిన్నింటిని చదవండి.

తల్లి/తండ్రి, ఈ సమాచారం 13 (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం, మా గోప్యతా ప్రకటన, గోప్యతా పాలసీ చూడండి.

నా ఖాతాకు నిర్వహణ బాధ్యత వహించేది ఎవరు?

మీ Google ఖాతా బాధ్యత మీ తల్లి/తండ్రిది. దానిని నిర్వహించడంలో సహాయం పొందడానికి వారు Family Link అనే యాప్‌ను ఉపయోగించవచ్చు. మీకు తగిన వయస్సు వచ్చినప్పుడు మీరు బాధ్యత తీసుకోవచ్చు.

మీ తల్లి/తండ్రి ఇలాంటివి చేయగలుగుతారు:

  • మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం, మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం, లేదా మీ ఖాతాను తొలగించడం.
  • మీ ఫోన్ లేదా టాబ్లెట్‌ను లాక్ చేయడం.
  • మీ ఫోన్ లేదా టాబ్లెట్ ఎక్కడ ఉందో చూడటం.
  • మీరు ఏ యాప్‌లను ఉపయోగించవచ్చో ఎంపిక చేయడం.
  • మీరు మీ యాప్‌లను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో చూడటం.
  • Google Search, YouTube, Google Play వంటి కొన్ని యాప్‌లలో మీరు చూసే వాటిని మార్చడం.
  • మీ యాక్టీవిటీ కంట్రోల్స్‌ను ఎంపిక చేయడం. (ఇవి Googleతో మీరు ఏం చేస్తారనే సమాచారాన్ని సేవ్ చేసే సెట్టింగ్‌లు.)
  • మీ యాప్‌లకు సెట్టింగ్‌లను, అనుమతులను ఎంపిక చేయడం.
  • మీ ఖాతాకు పేరు, పుట్టిన తేదీ, అలాగే ఇతర సమాచారాన్ని ఎంపిక చేయడం.
  • Google Play వంటి Google ప్రోడక్ట్‌లలో మీరు వేటిని డౌన్‌లోడ్ చేయవచ్చో, వేటిని కొనుగోలు చేయవచ్చో ఎంపిక చేయడం.

Google నా సమాచారాన్ని ఎందుకు, ఏ విధంగా ఉపయోగిస్తుంది?

మీరు గాని, మీ తల్లి/తండ్రి గాని మాకు అందించే సమాచారాన్ని మేము సేవ్ చేయవచ్చు, ఉదాహరణకు మీ పుట్టినరోజు వంటివి. మీరు మా యాప్‌లను, సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా మేము సమాచారాన్ని సేవ్ చేస్తాము. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము, వాటిని వివిధ కారణాల కోసం ఉపయోగిస్తాము — ఉదాహరణకు Google యాప్‌లను, సైట్‌లను మరింత సహాయకరంగా తయారు చేయడానికి.

మీ తల్లి/తండ్రితో, మీ సమాచారాన్ని మేము వేటి కోసం ఉపయోగించవచ్చో, వాటిలో కొన్నిటిని తెలుసుకోండి:

  • మా యాప్‌లను, సైట్‌లను పనిచేసేలా చేయడం కోసం: ఉదాహరణకు, Google Searchలో మీరు "కుక్క పిల్లలు" అని సెర్చ్ చేస్తే, మీ సమాచారాన్ని కుక్క పిల్లలకు సంబంధించిన విషయాలను చూపడానికి ఉపయోగిస్తాము.
  • మా యాప్‌లను, సైట్‌లను మెరుపరచడం కోసం: ఉదాహరణకు, ఏదైనా పని చేయకపోతే, దానిని సరిచేయడానికి మేము సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  • Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడం కోసం: ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము.
  • కొత్త యాప్‌లను, సైట్‌లను రూపొందించడం కోసం: Googleకు సంబంధించి మేము రూపొందించదగిన కొత్త వాటికి ఉపాయాలను కనిపెట్టడం కోసం, మా ప్రస్తుత యాప్‌లను, సైట్‌లను వ్యక్తులు ఏవిధంగా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకుంటాము.
  • మీకు నచ్చే అవకాశం ఉన్న వాటిని చూపించడం కోసం: ఉదాహరణకు, YouTube Kidsలో మీకు జంతువుల వీడియోలు చూడటం ఇష్టమయితే, మేము మీకు మరిన్నిటిని చూపవచ్చు.
  • మీకు యాడ్‌లను చూపించడానికి మీరు చూస్తున్న సైట్‌ల వంటి అంశాల ఆధారంగా.
  • మిమ్మల్ని సంప్రదించడానికి: ఉదాహరణకు, మీకు మెసేజ్ పంపడానికి, మేము మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా సరే, మీకు తెలియని వారి నుండి మెసేజ్ వచ్చినప్పుడు, తల్లి/తండ్రిని అడగండి.

వేటిని సేవ్ చేయాలో నేను Googleకు చెప్పవచ్చా?

అవును, మీ గురించి మేము సేవ్ చేసే కొన్ని విషయాలను మీరు మార్చవచ్చు. యాక్టివిటీ కంట్రోల్స్ వంటి మీ గోప్యతా సెట్టింగ్‌లు కొన్నింటిలో మీరు మార్పులు చేస్తే, మేము మీ తల్లి/తండ్రి‌కి తెలియజేస్తాము. వారు కూడా మీ సెట్టింగ్‌లను మార్చడంలో మీకు సహాయపడగలరు.

మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు, మీ తల్లి/తండ్రి ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు .

Google నా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైనా ఇతరులతో షేర్ చేస్తుందా?

మీ పేరు వంటి వ్యక్తిగత సమాచారాన్ని మేము Googleకు వెలుపల షేర్ చేసే అవకాశం ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని మేము షేర్ చేస్తే, అది సురక్షితంగా ఉండేలా చూడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము.

మేము కొంత వ్యక్తిగత సమాచారాన్ని వీరితో షేర్ చేయవచ్చు:

  • Googleలో మీ తల్లి/తండ్రి, ఫ్యామిలీ గ్రూప్‌తో షేర్ చేయవచ్చు
  • మేము కలిసి పని చేసే కంపెనీలతో
  • మీ తల్లి/తండ్రి అలా చేయవచ్చని మాకు చెప్పినప్పుడు
  • చట్టపరమైన కారణాల వల్ల మేము చేయాల్సి వచ్చినప్పుడు

నేను ఆన్‌లైన్‌లో వేటిని షేర్ చేస్తానో ఇంకెవరు చూడలుగుతారు?

మీరు ఆన్‌లైన్‌లో షేర్ చేసే ఇమెయిల్స్ లేదా ఫోటోల వంటి వేటినైనా చాలా మంది చూడవచ్చు. మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, తల్లి/తండ్రిని లేదా ఫ్యామిలీ మెంబర్‌ను అడగండి.

మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మా గోప్యతా పాలసీ చదవడంలో మీకు సహాయపడమని మీ తల్లి/తండ్రిని అడగండి.

Googleలో మీ గోప్యత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

మీరు సరియైన చోటికి వచ్చారు! మీరు మా యాప్‌లను, సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, Google సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది అన్నది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ Google ఖాతాను, పరికరాలను మేనేజ్ చేయడానికి మీ తల్లి/తండ్రి మీకు ఎలా సహాయపడవచ్చు అనేది కూడా మీరు నేర్చుకుంటారు.

తల్లి/తండ్రి, ఈ సమాచారం 13 (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం, మా గోప్యతా ప్రకటన, గోప్యతా పాలసీ చూడండి.

నా ఖాతాకు నిర్వహణ బాధ్యత వహించేది ఎవరు?

ప్రస్తుతం మీ Google ఖాతాకు మీ తల్లి/తండ్రి బాధ్యత వహిస్తున్నారు. మీ ఖాతాను స్వయంగా నిర్వహించడానికి అవసరమైనంత వయస్సు మీకు వచ్చే వరకు దానిని నిర్వహించడంలో సహాయం పొందడానికి వారు Family Link అనే యాప్‌ను ఉపయోగించవచ్చు.

మీ తల్లి/తండ్రి ఇలాంటివి చేయగలుగుతారు:

  • మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం, మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం, లేదా మీ ఖాతాను తొలగించడం.
  • మీ ఫోన్‌లు లేదా టాబ్లెట్‌ల వంటి పరికరాలను ఎంత సమయం పాటు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయంలో పరిమితులను సెట్ చేయడం.
  • మీ ఫోన్ లేదా టాబ్లెట్ ఎక్కడ ఉందో చూడటం.
  • మీరు ఏ యాప్‌లను ఉపయోగించవచ్చో ఎంపిక చేయడం.
  • మీరు మీ యాప్‌లను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో చూడటం.
  • Google Search, YouTube, Google Play వంటి కొన్ని యాప్‌లలోనూ సైట్స్‌లోనూ కంటెంట్ సెట్టింగ్‌లను నిర్వహించడం. ఈ సెట్టింగ్‌లు మీరు వేటిని చూస్తారనేదానిని మార్చవచ్చు.
  • మీ ఖాతాకు యాక్టీవిటీ కంట్రోల్స్‌ను; అంటే YouTube హిస్టరీ వంటి వాటిని, మీరు స్వయంగా నిర్వహించడాన్ని బ్లాక్ చేయడంతో సహా, వారు నిర్వహించడం.
  • మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో యాప్‌లకు అనుమతులను రివ్యూ చేయడం, అంటే ఉదాహరణకు యాప్‌లు మీ మైక్రోఫోన్, కెమెరా లేదా కాంటాక్ట్‌లను ఉపయోగించడానికి అనుమతులను ఇవ్వడం, లేదా ఇవ్వకపోవడం వంటివి.
  • మీ ఖాతాను గురించిన సమాచారాన్ని అంటే మీ పేరు, లింగం, లేదా పుట్టిన తేదీ వంటి వాటిని చూడటం, మార్చటం లేదా తొలగించడం.
  • మీ డౌన్‌లోడ్‌లు, కొనుగోళ్లను Google Play వంటి కొన్ని యాప్‌లు, సైట్‌లలో ఆమోదించడం.

Google నా సమాచారాన్ని ఎందుకు, ఏ విధంగా ఉపయోగిస్తుంది?

అనేక సైట్‌లు, యాప్‌ల విషయంలో జరిగినట్టే, మేము మీ తల్లి/తండ్రి మాకిచ్చే సమాచారాన్ని సేకరిస్తాము, అలాగే మీరు మా సైట్‌లు, యాప్‌లను ఉపయోగించేటప్పుడు కూడా సమాచారాన్ని సేకరిస్తాము. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము, మా ప్రోడక్ట్‌లను మీకు మరింత ఉపయోగపడేలా తీర్చి దిద్దడానికి దాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ డేటాను ఇందుకు సేకరిస్తాము:

  • మా యాప్‌లను, సైట్‌లను పనిచేసేలా చేయడం కోసం: ఉదాహరణకు, Google Searchలో మీరు "క్రీడలు" అని సెర్చ్ చేస్తే, మీ సమాచారాన్ని క్రీడలకు సంబంధించిన విషయాలను చూపడానికి ఉపయోగిస్తాము.
  • మా యాప్‌లను, సైట్‌లను మెరుపరచడం కోసం: ఉదాహరణకు, ఏదైనా పని చేయకపోతే, దానిని సరిచేయడానికి మేము సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  • Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడం కోసం: ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము, అంటే మోసాన్ని గుర్తించడం, దానిని నివారించడం వంటివి.
  • కొత్త యాప్‌లను, సైట్‌లను రూపొందించడం కోసం: మేము రూపొందించదగిన కొత్త Google ప్రోడక్ట్‌లకు ఉపాయాలను కనిపెట్టడం కోసం, మా ప్రస్తుత యాప్‌లను, సైట్‌లను వ్యక్తులు ఏవిధంగా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకుంటాము.
  • మీకోసం సమాచారాన్ని వ్యక్తిగతీకరించడానికి, అంటే మీకు నచ్చే అవకాశం ఉంది అని మేము అనుకున్న వాటిని చూపించడానికి. ఉదాహరణకు, మీరు YouTube Kidsలో జంతువుల వీడియోలను చూడటం ఇష్టపడితే, మేము మరిన్ని వీడియోలను చూడమని సిఫార్సు చేస్తాము.
  • మీకు యాడ్‌లను చూపించడానికి మీరు చూస్తున్న సైట్‌ల వంటి అంశాల ఆధారంగా.
  • మిమ్మల్ని సంప్రదించడానికి: ఉదాహరణకు, ఏదైనా సెక్యూరిటీ సమస్య ఉన్నప్పుడు, మేము మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా సరే, మీకు తెలియని వారి నుండి మెసేజ్ వచ్చినప్పుడు, తల్లి/తండ్రిని అడగండి.

వేటిని సేవ్ చేయాలో నేను Googleకు చెప్పవచ్చా?

అవును, మీ గురించి మేము సేవ్ చేసే కొన్ని విషయాలను మీరు మార్చవచ్చు. ఉదాహరణకు, మీ YouTube హిస్టరీని మీ Google ఖాతాకు మేము సేవ్ చేయకూడదని అనుకుంటే మీరు YouTube హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. యాక్టివిటీ కంట్రోల్స్ వంటి మీ గోప్యతా సెట్టింగ్‌లు కొన్నింటిలో మీరు మార్పులు చేస్తే, మేము మీ తల్లి/తండ్రికి తెలియజేస్తాము. వారు కూడా మీ సెట్టింగ్‌లను మార్చడంలో మీకు సహాయపడగలరు.

మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు, మీ తల్లి/తండ్రి ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు .

Google నా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైనా ఇతరులతో షేర్ చేస్తుందా?

మేము Google వెలుపల మీ పేరు, ఇమెయిల్ అడ్రస్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని మేము షేర్ చేస్తే, అది సురక్షితంగా ఉండేలా చూడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము.

మేము కొంత వ్యక్తిగత సమాచారాన్ని వీరితో షేర్ చేయవచ్చు:

  • Googleలో మీ తల్లి/తండ్రితో, ఫ్యామిలీ గ్రూప్‌తో
  • మేము కలసి పని చేసే కంపెనీలతో
  • మీ తల్లి/తండ్రి అలా చేయవచ్చని మాకు చెప్పినప్పుడు
  • చట్టపరమైన కారణాల వల్ల మేము చేయాల్సి వచ్చినప్పుడు

నేను ఆన్‌లైన్‌లో వేటిని షేర్ చేస్తానో ఇంకెవరు చూడలుగుతారు?

మీరు ఆన్‌లైన్‌లో షేర్ చేసే ఇమెయిల్స్ లేదా ఫోటోల వంటి వేటినైనా చాలా మంది చూడవచ్చు. ఆన్‌లైన్‌లో ఏదైనా షేర్ చేసిన తర్వాత, దాన్ని తీసివేయడం కష్టమవుతుంది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, తల్లి/తండ్రిని లేదా ఫ్యామిలీ మెంబర్‌ను అడగండి.

మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మా గోప్యతా పాలసీ చదవడంలో మీకు సహాయపడమని మీ తల్లి/తండ్రిని అడగండి.

Googleలో మీ గోప్యత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

మీ Google ఖాతా గురించి సమాచారాన్ని Google ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది అన్నది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ Google ఖాతాను, పరికరాలను మేనేజ్ చేయడానికి మీ తల్లి/తండ్రి మీకు ఎలా సహాయపడవచ్చు అనేది కూడా మీరు నేర్చుకుంటారు.

కనీస వయో అర్హతకు తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, యుక్తవయస్కులు వారి స్వంత ఖాతాను మేనేజ్ చేసుకోవడం కోసం ఈ సమాచారం ఉపయోగపడుతుంది, ఇది Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరింత తెలుసుకోవడం కోసం, మా Privacy Notice and Privacy Policy చూడండి.

నా ఖాతాను నిర్వహించడంలో నా తల్లి/తండ్రి సహాయం చేయవచ్చా?

మీ Google ఖాతాకు సంబంధించిన విషయాలను నిర్వహించడంలో సహాయం పొందడానికి, మీ తల్లి/తండ్రి Family Link అనే యాప్‌ను ఉపయోగించవచ్చు. మీ పరికరాన్ని బట్టి వారు ఇటువంటివి చేయగలుగుతారు:

  • మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం, మీ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చడం, లేదా మీ ఖాతాను తొలగించడం.
  • మీ పరికరాన్ని మీరు ఎంత సమయం పాటు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనే దానిపై పరిమితులను సెట్ చేయడం.
  • మీరు సైన్ ఇన్ చేసిన, యాక్టివ్‌గా ఉన్న పరికరాల లొకేషన్‌ను చూడటం.
  • మీ యాప్‌లను నిర్వహించి, మీరు వాటిని ఎంత మేరకు వాడుతున్నారో చూడటం.
  • Google Search, YouTube, Google Play వంటి కొన్ని యాప్‌లలోనూ సైట్స్‌లోనూ కంటెంట్ సెట్టింగ్‌లను నిర్వహించడం. ఈ సెట్టింగ్‌లు మీరు వేటిని చూస్తారనేదానిని మార్చవచ్చు.
  • మీ ఖాతాకు యాక్టీవిటీ కంట్రోల్స్‌ను; అంటే YouTube హిస్టరీ వంటి వాటిని, మీరు స్వయంగా నిర్వహించడాన్ని బ్లాక్ చేయడంతో సహా, వారు నిర్వహించడం.
  • మీ పరికరంలో యాప్‌లకు అనుమతులను రివ్యూ చేయడం, అంటే ఉదాహరణకు యాప్‌లు మీ మైక్రోఫోన్, కెమెరా లేదా కాంటాక్ట్‌లను ఉపయోగించడానికి అనుమతులను ఇవ్వడం, లేదా ఇవ్వకపోవడం వంటివి.
  • మీ ఖాతాను గురించిన సమాచారాన్ని అంటే మీ పేరు, లింగం, లేదా పుట్టిన తేదీ వంటి వాటిని చూడటం, మార్చటం లేదా తొలగించడం.
  • మీ డౌన్‌లోడ్‌లు, కొనుగోళ్లను Google Play వంటి కొన్ని యాప్‌లు, సైట్‌లలో ఆమోదించడం.

Google ఎందుకు, ఏవిధంగా నా సమాచారాన్ని సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది?

అనేక సైట్‌లు, యాప్‌ల విషయంలో జరిగినట్టే, మేము మీ తల్లి/తండ్రి మాకిచ్చే సమాచారాన్ని సేకరిస్తాము, అలాగే మీరు మా సైట్‌లు, యాప్‌లను ఉపయోగించేటప్పుడు కూడా సమాచారాన్ని సేకరిస్తాము. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము, మా ప్రోడక్ట్‌లను మీకు మరింత ఉపయోగపడేలా తీర్చి దిద్దడానికి దాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ డేటాను ఇందుకు సేకరిస్తాము:

  • Googleను, మా యూజర్‌లను, పబ్లిక్‌ను సురక్షితంగా ఉంచడం కోసం: ఆన్‌లైన్‌లో వ్యక్తులను మరింత సురక్షితంగా ఉంచడానికి మేము డేటాను ఉపయోగిస్తాము, అంటే మోసాన్ని గుర్తించడం, దానిని నివారించడం వంటివి.
  • మా సర్వీస్‌లను అందించడం కోసం: ఆ డేటాను మేము మా సర్వీస్‌లను అందించడానికి ఉపయోగిస్తాము; అంటే ఫలితాలను అందించడం కోసం, మీరు సెర్చ్ చేసే క్వెరీలను ప్రాసెస్ చేయడం వంటి వాటికి.
  • మా సర్వీస్‌లను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి: ఉదాహరణకు మేము మా ప్రోడక్ట్‌లు పనిచేయడం ఆగిపోవాల్సి ఉన్నప్పుడు అవి ఆగిపోయాయో లేదో ట్రాక్ చేయగలుగుతాము. అలాగే సెర్చ్ క్వెరీలలో వేటికి స్పెల్లింగ్‌లు ఎక్కువ తరుచుగా తప్పుపోతుంటాయో అర్థం చేసుకోవడం వల్ల, మా సర్వీస్‌లన్నింటా స్పెల్ చెక్ ఫీచర్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయం లభిస్తుంది.
  • కొత్త సర్వీస్‌లను అభివృద్ధి చేయడానికి: ఈ డేటా మాకు కొత్త సర్వీస్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, వ్యక్తులు Google మొదటి ఫోటోల యాప్ అయిన Picasaలో తమ ఫోటోలను ఏ విధంగా క్రమంలో పెట్టుకున్నారో అర్థం చేసుకోవడం అనేది, Google Photosను డిజైన్ చేయడంలోనూ లాంచ్ చేయడంలోనూ మాకు సహాయపడింది.
  • కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడానికి, అంటే మీకు నచ్చే అవకాశం ఉంది అని మేము అనుకొనే వాటిని చూపించడానికి. ఉదాహరణకు, మీరు YouTubeలో క్రీడల వీడియోలను చూడటం ఇష్టపడితే, మేము మరిన్ని వీడియోలను చూడమని సిఫార్సు చేస్తాము.
  • మీకు యాడ్‌లను చూపించడానికి మీరు సందర్శించే సైట్‌లు, ఎంటర్ చేసే సెర్చ్ క్వెరీలు, లేదా మీ నగరం లేదా రాష్ట్రం ఆధారంగా.
  • పనితీరును అంచనా వేయడానికి: మేము డేటాను పనితీరును అంచనా వేయడానికి, మా సర్వీస్‌లను ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తాము.
  • మిమ్మల్ని సంప్రదించడానికి: ఉదాహరణకు మేము ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీని గుర్తిస్తే, ఆ నోటిఫికేషన్‌ను మీకు పంపడానికి మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించవచ్చు.

Google వేటిని సేవ్ చేస్తుందనే దానిని నేను ఏ విధంగా నిర్ణయించగలను?

మీ సెట్టింగ్‌లతో, మేము సేకరించే డేటాతో పాటు, ఆ డేటా ఎలా ఉపయోగించబడుతుందో అనే దానిని మీరు పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు, మీ YouTube హిస్టరీని మీ Google ఖాతాకు మేము సేవ్ చేయకూడదని అనుకుంటే మీరు YouTube హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. మీ యాక్టివిటీ కంట్రోల్స్‌లో మీరు మార్పులు చేస్తే, మేము మీ తల్లి/తండ్రి‌కి తెలియజేస్తాము. మీ గోప్యతా సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి

మీ గురించి, మీ Google ఖాతా గురించి కొంత సమాచారాన్ని మీరు ఎల్లప్పుడూ చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు..

Google నా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైనా ఇతరులతో షేర్ చేస్తుందా?

చాలా తక్కువ సందర్భాలలో, చట్టపరమైన అవసరాలు ఉంటే తప్ప, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని Google వెలుపలి కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులతో షేర్ చేయము. ఈ సమాచారాన్ని మేము షేర్ చేస్తే, అది సురక్షితంగా ఉండేలా చూడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము.

మేము కొంత వ్యక్తిగత సమాచారాన్ని వీరితో షేర్ చేయవచ్చు:

  • మీ తల్లి/తండ్రితో, అలాగే Googleలోని ఫ్యామిలీ గ్రూప్‌తో.
  • ​​మీరు, మీ తల్లి/తండ్రి మాకు అనుమతిని ఇచ్చిన పక్షంలో లేదా చట్ట పరమైన కారణాల కోసం. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని దానిని అందించడం తప్పనిసరి అని మేము నమ్మితే, Googleకు వెలుపల ఇందుకోసం షేర్ చేస్తాము:
  • ఏదైనా వర్తించదగిన చట్టం, నిబంధన, చట్టపరమైన ప్రక్రియ లేదా అమలు చేయదగిన ప్రభుత్వపరమైన అభ్యర్థనకు అనుగుణంగా ఉండటం.
  • సంభావ్య ఉల్లంఘనల విచారణతో సహా వర్తించదగిన సర్వీస్ నియమాలను అమలు చేయడం.
  • మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడం, నివారించడం లేదా పరిష్కరించడం.
  • చట్టప్రకారం అవసరమైన లేదా అనుమతించబడిన పరిధి మేరకు, Google, మా యూజర్‌లు లేదా పబ్లిక్ యొక్క హక్కులు, ఆస్తి లేదా భద్రతకు జరిగే హానిని నివారించడం.
  • బాహ్య ప్రాసెసింగ్ కోసం. మేము కలిసి పని చేసే కంపెనీలకు వ్యక్తిగత సమాచారాన్ని, మేము ఇచ్చిన సూచనల మేరకు దానిని ప్రాసెస్ చేయడానికి అందిస్తాము. ఉదాహరణకు, మేము బయటి కంపెనీలను మాకు కస్టమర్ సపోర్ట్ విషయంలో సహాయం చేయడానికి ఉపయోగించుకుంటాము, అటువంటప్పుడు యూజర్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, ఆ కంపెనీతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవలసి వస్తుంది.

నేను షేర్ చేసే ఫోటోలు, ఇమెయిల్, డాక్యుమెంట్‌ల వంటి వాటిని ఇంకెవరు చూడగలుగుతారు?

మీరు ఉపయోగించే Google యాప్‌లలో, సైట్‌లలో నిర్దిష్ట కంటెంట్‌ను ఇతర వ్యక్తులతో షేర్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు.

మీరు షేర్ చేసినప్పుడు, యాప్‌లలోను, ఇంకా Googleకు వెలుపల ఉన్న సైట్‌లలో కూడా ఇతర వ్యక్తులు మళ్లీ షేర్ చేసే అవకాశం ఉందని మర్చిపోవద్దు.

మీరు మీ ఖాతా నుండి మీ స్వంత కంటెంట్‌ను ఎప్పుడైనా తొలగించవచ్చు, కానీ మీరు ఇప్పటికే షేర్ చేసిన కాపీలను ఇది తొలగించదు.

మీరు షేర్ చేసే వాటి గురించి కొంచెం ఆలోచించండి, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే షేర్ చేయండి.

ఈ టాపిక్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు ఎల్లప్పుడూ మా గోప్యతా పాలసీ చూడవచ్చు.