తరచుగా అడిగే ప్రశ్నలు

Family Link గురించి అత్యంత తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు మేము సమాధానాలను సేకరించాము. మీరు ఇప్పటికే యాప్‌ను ఉపయోగిస్తూ ఉండి, మీకు స్వంతంగా ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే, మీరు మరింత సమాచారం కోసం మా సహాయ కేంద్రాన్ని చూడవచ్చు.

ఇది ఎలా పని చేస్తుంది

Family Link ఎలా పని చేస్తుంది?

Google అందించే Family Link అనేది తల్లిదండ్రులు తమ పిల్లలు లేదా యుక్త వయస్కులు Android అలాగే ChromeOS పరికరాలలో అన్వేషిస్తున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండటానికి అలాగే ఆన్‌లైన్‌లో వారిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ముందుగా, పిల్లలు/యుక్త వయస్కులకు అనుకూలమైన పరికరం అవసరం (Family Linkతో ఏ పరికరాలు పని చేస్తాయో చూడండి). ఆ తర్వాత, పిల్లలు/యుక్త వయస్కులను ఆ పరికరానికి సైన్ ఇన్ చేయాలి. పిల్లలు/యుక్త వయస్కులు ఇప్పటికే Family Link ద్వారా పర్యవేక్షించబడితే, సైన్ ఇన్ చేయడం అనేది తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయడంలో వారికి సహాయపడుతుంది. యుక్తవయస్కులు ఇప్పటికే Family Link ద్వారా పర్యవేక్షించబడకపోతే, తల్లిదండ్రులు Family Linkను Android సెట్టింగ్‌ల నుండి కూడా జోడించవచ్చు.

తల్లిదండ్రులు 13 సంవత్సరాల లోపు వయస్సు (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) ఉన్న తమ పిల్లల కోసం కూడా Google ఖాతాను క్రియేట్ చేయవచ్చు. పూర్తయిన తర్వాత, పిల్లలు తమ కొత్త ఖాతాతో వారి పరికరానికి సైన్-ఇన్ చేయవచ్చు.

ఖాతాలు లింక్ చేయబడిన తర్వాత, పరికర వినియోగ వ్యవధిని గమనిస్తూ ఉండటం అలాగే తమ పిల్లలను వయసుకు తగిన కంటెంట్‌కు గైడ్ చేయడం వంటి పనులు చేయడంలో తమకు సహాయపడేందుకు తల్లిదండ్రులు Family Linkను ఉపయోగించవచ్చు.

నా పిల్లలకు అనుచితమైన కంటెంట్ అంతటినీ Family Link బ్లాక్ చేస్తుందా?

Family Link అనుచితమైన కంటెంట్‌ను బ్లాక్ చేయదు, కానీ అంతర్గతంగా ఉన్న సెట్టింగ్‌లు మీకు ఫిల్టరింగ్ ఆప్షన్‌లను అందిస్తాయి. Search, Chrome, అలాగే YouTube వంటి నిర్దిష్ట Google యాప్‌లలో ఫిల్టరింగ్ ఆప్షన్‌లు ఉంటాయి, వాటిని మీరు Family Linkలో కనుగొనవచ్చు. దయచేసి ఈ ఫిల్టర్‌లు ఖచ్చితమైనవి కావని గమనించండి, కాబట్టి మీరు మీ పిల్లలు చూడకూడదనుకునే అందరికీ తగని, స్పష్టంగా చూపే, లేదా ఇతర కంటెంట్‌ను కొన్నిసార్లు వారు చూడవచ్చు. మీ కుటుంబానికి ఏది సరైనదో నిర్ణయించడానికి, యాప్ సెట్టింగ్‌లు, అలాగే Family Link అందించే సెట్టింగ్‌లు ఇంకా టూల్స్‌ను రివ్యూ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.

తల్లిదండ్రులు Androidలో Family Linkను ఉపయోగించవచ్చా?

అవును. Lollipop (5.0) ఇంకా అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో పని చేస్తున్న Android పరికరాలలో తల్లిదండ్రులు Family Linkను రన్ చేయవచ్చు.

తల్లిదండ్రులు iOSలో Family Linkను ఉపయోగించవచ్చా?

అవును. iOS 11 ఇంకా అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో పని చేస్తున్న iPhoneలలో తల్లిదండ్రులు Family Linkను రన్ చేయవచ్చు.

తల్లిదండ్రులు వెబ్ బ్రౌజర్‌లో Family Linkను ఉపయోగించవచ్చా?

తల్లిదండ్రులు తమ పిల్లల ఖాతా సెట్టింగ్‌లు ఇంకా ఫీచర్‌లలో దాదాపు అన్నింటినీ వెబ్ బ్రౌజర్‌లో మేనేజ్ చేయవచ్చు. ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Android పరికరాలలో Family Link ద్వారా పిల్లలు లేదా యుక్త వయస్కులను పర్యవేక్షించవచ్చా?

ఉత్తమ ఫలితాల కోసం, Family Linkతో పర్యవేక్షించబడే పిల్లలు లేదా యుక్త వయస్కులు 7.0 (Nougat) లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో పని చేసే Android పరికరాలను ఉపయోగించాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. Android వెర్షన్‌లు 5.0 అలాగే 6.0 (Lollipop ఇంకా Marshmallow)తో పని చేసే పరికరాలు కూడా వాటికి Family Link సెట్టింగ్‌లను వర్తింపజేసుకునే అవకాశం ఉండవచ్చు. మరింత తెలుసుకోవడానికి, మా సహాయ కేంద్రాన్ని చూడండి.

Chromebook (ChromeOS)లో Family Link ద్వారా పిల్లలు లేదా యుక్త వయస్కులను పర్యవేక్షించవచ్చా?

అవును, పిల్లలు ఇంకా యుక్త వయస్కులు Chromebookలలో తమ Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు, వారిని పర్యవేక్షించవచ్చు. తల్లిదండ్రులు తమ చిన్నారి Chromebook ఇంకా ఖాతా సెట్టింగ్‌లను మేనేజ్ చేయడం, అలాగే వెబ్‌సైట్ పరిమితులను సెట్ చేయడం వంటి పనులను చేయవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.

iOS పరికరాలు అలాగే వెబ్ బ్రౌజర్‌లలో Family Link ద్వారా పిల్లలు లేదా యుక్త వయస్కులను పర్యవేక్షించవచ్చా?

iOS, వెబ్ బ్రౌజర్‌లు, లేదా పర్యవేక్షించబడని ఇతర పరికరాలకు సైన్ ఇన్ చేసిన పిల్లలు లేదా యుక్త వయస్కులను పాక్షికంగా మాత్రమే పర్యవేక్షించవచ్చు. పిల్లలు అలాగే యుక్త వయస్కులు తమ తల్లి/తండ్రి సమ్మతితో iOS పరికరాలు ఇంకా వెబ్ బ్రౌజర్‌లలో తమ Google ఖాతాకు సైన్ ఇన్ చేయవచ్చు. తల్లిదండ్రులు YouTube అలాగే Google Searchలో తమ పిల్లల ఖాతా సెట్టింగ్‌లలో కొన్నింటిని మేనేజ్ చేయడం కొనసాగించవచ్చు, అలాగే పిల్లలు iOS పరికరం లేదా వెబ్‌లో సైన్ ఇన్ చేసి, Google యాప్‌లు ఇంకా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు ఆ సెట్టింగ్‌లు వర్తిస్తాయి. Family Link యాప్‌లోని ఇతర ఫీచర్‌లు, ఉదాహరణకు మీ పిల్లలు ఉపయోగించదగిన యాప్‌లను మేనేజ్ చేయడం, Chromeలో వారు చూసే వాటిని ఫిల్టర్ చేయడం, అలాగే పరికర వినియోగ వ్యవధి పరిమితులను సెట్ చేయడం వంటివి, పిల్లల iOS పరికరం లేదా వెబ్‌లో వారి యాక్టివిటీలకు వర్తించవు. పిల్లలు/యుక్త వయస్కులు iOS పరికరాలు అలాగే వెబ్ బ్రౌజర్‌లలో సైన్ ఇన్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

చిన్నారి పరికరం అలాగే Google ఖాతాను సెటప్ చేయడానికి ఎంతసేపు పడుతుంది?

మీ చిన్నారి Google ఖాతా ఇంకా Android పరికరాన్ని సెటప్ చేయడానికి మీరు దాదాపు 15 నిమిషాలు కేటాయించేందుకు ప్లాన్ చేసుకోవాలి.

ఖాతాలు

Family Linkతో మేనేజ్ చేయబడే Google ఖాతాను కలిగి ఉండేందుకు పిల్లలకు కనీస వయస్సు ఏదైనా ఉందా?

లేదు. మీ పిల్లలు వారి మొదటి Android లేదా ChromeOS పరికరాన్ని ఉపయోగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారనే దానిపై మీరే నిర్ణయం తీసుకోవాలి.

నా పిల్లలు వారి Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు యాడ్‌లు కనిపిస్తాయా?

Google సర్వీస్‌లు యాడ్‌లను కలిగి ఉంటాయి అలాగే మీ పిల్లలు మా ప్రోడక్ట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు యాడ్‌లను చూడవచ్చు. అయితే, వారికి వ్యక్తిగతీకరించిన యాడ్‌లు కనిపించవు అలాగే పిల్లలు యాప్‌లలో యాడ్‌లను చూస్తున్నప్పుడు గుర్తించడానికి మీకు టూల్స్ అందించబడతాయి.

నా యుక్త వయస్కులను పర్యవేక్షించడానికి నేను Family Linkను ఉపయోగించవచ్చా?

అవును, టీనేజర్‌లను (13 సంవత్సరాలు పైబడిన లేదా మీ దేశంలో సమ్మతి ఇవ్వగలిగే వయసు ఉన్న పిల్లలు) పర్యవేక్షించడానికి Family Linkను ఉపయోగించవచ్చు. సమ్మతి ఇవ్వగలిగే వయసు లోపు ఉన్న పిల్లల మాదిరిగా కాకుండా, యుక్త వయస్కులు ఎప్పుడైనా పర్యవేక్షణను ఆపివేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. వారు అలా చేస్తే, మీకు తెలియజేయబడుతుంది అలాగే మీరు అన్‌లాక్ చేస్తే తప్ప, వారి Android పరికరం 24 గంటల పాటు తాత్కాలికంగా లాక్ చేయబడుతుంది. ఒక తల్లి/తండ్రిగా, యుక్త వయస్కుల పరికర వినియోగ సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం లేకుండా ఎప్పుడైనా వారిపై పర్యవేక్షణను తీసివేయడాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు.

నేను స్కూల్ లేదా ఆఫీస్ ద్వారా పొందిన నా ఖాతాను, నా ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి ఉపయోగించవచ్చా?

లేదు. ఆఫీస్ లేదా స్కూల్ ద్వారా అందించబడిన ఖాతాలు ఫ్యామిలీ గ్రూప్‌ను మేనేజ్ చేయడానికి లేదా Family Link ద్వారా పర్యవేక్షణను మేనేజ్ చేయడానికి ఉపయోగించబడవు. మీరు Family Linkతో మీ Gmail ఖాతా వంటి వ్యక్తిగత Google ఖాతాను ఉపయోగించవచ్చు.

పిల్లలు తమ పర్యవేక్షించబడే పరికరాలకు పలు Google ఖాతాలను జోడించవచ్చా?

సాధారణంగా కుదరదు. పిల్లలకు తమ వ్యక్తిగత పర్యవేక్షించబడే Google ఖాతాతో పాటు Google Workspace for Education ఖాతాను జోడించడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ముఖ్యమైన ప్రోడక్ట్ ప్రవర్తనలను నిర్వహించడంలో ఈ పరిమితి మాకు సహాయపడుతుంది. ఉదాహరణకు, పరికరంలో మరొక ఖాతా ఉన్నట్లయితే, తల్లి/తండ్రి ఆమోదం లేకుండానే Play నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి పిల్లలు ఆ ఖాతాకు మారవచ్చు.

నా పిల్లలకు 13 సంవత్సరాలు (లేదా మీ దేశంలో వయోపరిమితి) వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది?

మీ పిల్లలకు 13 సంవత్సరాలు (లేదా మీ దేశంలో వర్తించే వయస్సు) వచ్చినప్పుడు, వారు పర్యవేక్షించబడని Google ఖాతాకు ముందడుగు వేయడానికి ఆప్షన్ కలిగి ఉంటారు. పిల్లలకు 13 సంవత్సరాలు నిండకముందే, తమ ఖాతాపై నియంత్రణ అధికారాన్ని పొందడానికి పిల్లలకు వారి పుట్టినరోజు నాడు అర్హత లభిస్తుందని తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారికి ఒక ఈమెయిల్ వస్తుంది, కాబట్టి మీరు ఇకపై వారి ఖాతాను మేనేజ్ చేయలేరు. తమకు 13 సంవత్సరాలు నిండిన రోజున, పిల్లలు తమ స్వంత Google ఖాతాను మేనేజ్ చేయాలనుకుంటున్నారా లేదా తమ కోసం వారి తల్లి/తండ్రి మేనేజ్ చేయడాన్ని కొనసాగించాలనుకుంటున్నారా అనేది ఎంచుకోవచ్చు. ఒక తల్లి/తండ్రిగా, పిల్లల వయస్సు 13 సంవత్సరాలు పైబడినప్పుడు మీరు ఎప్పుడైనా పర్యవేక్షణను తీసివేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు.

మొత్తం సెట్ చేసారా? యాప్‌ని పొందండి.

మీ పిల్లలు అన్వేషించే సమయంలో గమనిస్తూ ఉండటం కోసం మీ పరికరంలో Family Linkని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్మార్ట్ ఫోన్ లేదా?

మీరు పర్యవేక్షణను ఆన్‌లైన్‌లో సెటప్ చేయవచ్చు.
మరింత తెలుసుకోండి